ఉద్యోగుల నిబద్ధతతోనే జోన్‌కు ఉన్నత స్థానం

ABN , First Publish Date - 2020-11-21T05:46:47+05:30 IST

విధి నిర్వహణలో ఉద్యోగుల నిబద్ధత, అంకితభావమే జోన్‌ను ఉన్నత స్థానంలో నిలబెట్టిందని తూర్పుకోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌ విద్యాభూషణ్‌ పేర్కొన్నారు.

ఉద్యోగుల నిబద్ధతతోనే జోన్‌కు ఉన్నత స్థానం

తూర్పుకోస్తా రైల్వే జీఎం విద్యాభూషణ్‌

విశాఖపట్నం, నవంబరు 20: విధి నిర్వహణలో ఉద్యోగుల నిబద్ధత, అంకితభావమే జోన్‌ను ఉన్నత స్థానంలో నిలబెట్టిందని తూర్పుకోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌ విద్యాభూషణ్‌ పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక గోవింద్‌ బల్లా పంత్‌ 2020 వార్షిక ఉత్తమ జోన్‌ అవార్డును సొంతం చేసుకోవడంలో అధికారులు, సిబ్బంది చేసిన కృషి అభినందనీయమన్నారు. అకౌంట్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, ట్రాఫిక్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ అవార్డులను కూడా పొందడం ఆనందదాయకమని తెలిపారు. కొవిడ్‌ మహమ్మారి విజృంభించిన సమయంలో కూడా లక్ష్యాలను అధిగమించాలనే సంకల్పంతో, చిత్తశుద్ధితో విధులు నిర్వహించి దేశం నలుమూలలకు సరకు రవాణా చేయడంలో సిబ్బంది సత్ఫలితాలను సాధించారని కొనియాడారు. జోన్‌ పురోగతికి అందిస్తున్న సేవలు కొనసాగించాలని కోరారు.  


Read more