-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Rachapalli people request
-
రాచపల్లి నుంచి తరలిస్తే ఆందోళన
ABN , First Publish Date - 2020-11-21T05:46:25+05:30 IST
మండలంలోని రాచపల్లి సెంటర్‌లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న తమ రేషన్ కార్డులు తదిత రాలను హఠాత్తుగా తామరం గ్రామ సచివాలయ పరిధిలో కలి పేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని రాచపల్లి పెద్దలు యర్రాపాత్రుడు, జోగిపాత్రుడు, రాంబాబు, గిరిబాబు ఆరోపించారు.

మాకవరపాలెం, నవంబరు 20 : మండలంలోని రాచపల్లి సెంటర్‌లో ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న తమ రేషన్ కార్డులు తదిత రాలను హఠాత్తుగా తామరం గ్రామ సచివాలయ పరిధిలో కలి పేందుకు అధికార పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని రాచపల్లి పెద్దలు యర్రాపాత్రుడు, జోగిపాత్రుడు, రాంబాబు, గిరిబాబు ఆరోపించారు. ఈ మేరకు మండల పరిషత్ కార్యాలయ ఏవో మూర్తికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. పిల్లల చదువులు, వ్యాపారం నిమిత్తం బస్సు సౌకర్యం కోసం రాచపల్లి గ్రామం నుంచి వచ్చి సెంటర్‌లో గృహాలు నిర్మించుకొని నివాసం ఉంటున్నామన్నారు. అయితే ఇప్పుడు పంచాయతీ కార్యదర్శి, అధికార పార్టీ నాయకులు కలిసి టీడీపీ సానుభూతిపరులమైన తమ సుమారు 50 కుటుంబాలకు చెందిన రేషన్ కార్డులు తదితరాలన్నీ తామరం సచివాలయంలో తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారన్నారు. ఈ ప్రయత్నాలను విరమించుకోకుంటే ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.