నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు
ABN , First Publish Date - 2020-11-13T06:17:47+05:30 IST
కాలం చెల్లిన విద్యుత్ ఫీడర్లు, బ్రేకర్లు పాడైన విద్యుత్ లైన్ల మార్పునకు రూ.6 కోట్లతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఏపీఈపీడీసీఎల్ జిల్లా సూరింటెండెంట్ ఇంజనీర్ ఏవీవీ సూర్యప్రతాప్ ఆదేశించారు.
కాలం చెల్లిన ఫీడర్ల మార్పునకు డీపీఆర్ సిద్ధం చేయండి
సిబ్బంది సమీక్షలో ఏపీఈపీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈ సూర్యప్రతాప్
నర్సీపట్నం టౌన్, నవంబరు 12 : కాలం చెల్లిన విద్యుత్ ఫీడర్లు, బ్రేకర్లు పాడైన విద్యుత్ లైన్ల మార్పునకు రూ.6 కోట్లతో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని ఏపీఈపీడీసీఎల్ జిల్లా సూరింటెండెంట్ ఇంజనీర్ ఏవీవీ సూర్యప్రతాప్ ఆదేశించారు. పెదబొడ్డేపల్లి ఈఈ కార్యాలయంలో గురువారం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ వినియోగానికి అనుగుణంగా కొత్త సబ్ స్టేషన్లు, కొత్తఫీడర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈఈ సురేశ్‌బాబు, బి.వేదమూర్తి, డివిజన్ పరిధిలోని ఉప కార్యనిర్వహక అధికారులు పాల్గొన్నారు.