అర్హులందరికీ పక్కా ఇళ్లు : ఎమ్మెల్యే గణేశ్‌

ABN , First Publish Date - 2020-12-26T05:45:18+05:30 IST

రాజకీయాలకు అతీతంగా ప్రతి పేదవానికి ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇస్తుందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ స్పష్టం చేశారు.

అర్హులందరికీ పక్కా ఇళ్లు : ఎమ్మెల్యే గణేశ్‌
బయపురెడ్డిపాలెంలో పట్టాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గణేశ్‌

నర్సీపట్నం అర్బన్‌/ నాతవరం, డిసెంబరు 25 : రాజకీయాలకు అతీతంగా ప్రతి పేదవానికి ప్రభుత్వం ఇల్లు నిర్మించి ఇస్తుందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ స్పష్టం చేశారు. నర్సీపట్నం మండలం బయపురెడ్డిపాలెం, మండల కేంద్రమైన నాతవరంలలో శుక్రవారం 420 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాల్లో భాగంగా నియోజకవర్గంలో 8232 మందికి పట్టాలు పంపిణీ చేస్తున్నామన్నారు. పట్టాలు పొందిన వారందరికీ త్వరలోనే ఇళ్లు కూడా మంజూరు కానున్నట్టు చెప్పారు. అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్‌ పాలన సాగిస్తున్నట్టు వివరించారు. సబ్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య,  నర్సీపట్నం మునిసిపల్‌ కమిషనర్‌ కనకారావు, తహసీల్దార్‌ కె.జయ, హౌసింగ్‌ విభాగం అధికారులతో పాటు మునిసిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ సన్యాసిపాత్రుడు, వైసీపీ నాయకులు కోనేటి రామకృష్ణ, చినబాబులు, మోహన్‌, స్వామినాయుడు, నాతవరం ఎంపీడీవో యాదగిరేశ్వరరావు, తహసీల్దార్‌ జానకమ్మ, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అంకంరెడ్డి జమీలు, వైసీపీ నాయకులు శెట్టి నూకరాజు, సునీల్‌, అప్పలరాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


పి.ఎల్‌.పురంలో..

పాయకరావుపేట రూరల్‌ :  నియోజకవర్గంలోని లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం మండలంలోని పి.ఎల్‌.పురంలో ప్రారంభమైంది. ఎమ్మెల్యే గొల్ల బాబురావు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పేదకు పక్కా గృహం ఉండాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యంగా పేర్కొన్నారు.  నియోజకవర్గంలో 9231 మందికి పట్టాలు అందిస్తున్నామన్నారు. డీఆర్‌డీఏ పీడీ వి.విశ్వేశ్వరరావు, నాలుగు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో పాటు మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, జిల్లా వ్యవసాయ సలహా బోర్డు చైర్మన్‌ చిక్కాల రామారావు, వైసీపీ నాయకులు సాగి సీతారామరాజు, వీసం రామకృష్ణ, డి.బాబూరావు, డి.సాయిబాబా, బొలిశెట్టి గోవింద్‌, జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 


 ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ఎలమంచిలి : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని ఎమ్మెల్యే కన్నబాబురాజు అన్నారు. శుక్రవారం మర్రిబంద సమీపంలో ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేసి మాట్లాడారు. సీఎం జగన్‌ నిర్ణయంతో పేదలం దరికీ పక్కా గృహాల భాగ్యం కలుగుతుందన్నారు. డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జ్‌ సుకుమారవర్మ, వైసీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బోదెపు గోవింద్‌, పట్టణ అధ్యక్షుడు బొద్దపు యర్రయ్యదొర ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. మునిసిపల్‌ కమిషనర్‌ కృష్ణవేణి, డీఈ మునిశేఖర్‌, నాలుగు మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లతో పాటు నేతలు రంగసాయి, శివ, బెజవాడ నాగేశ్వరరావు, రవికుమార్‌, దాసరి కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-26T05:45:18+05:30 IST