రైల్వే గేటు మూయవద్దని వినతి

ABN , First Publish Date - 2020-11-06T06:02:17+05:30 IST

పెదబోదిగల్లం ముస్లిం గ్రామానికి ఆనుకుని ఉన్న రైల్వేగేటు వద్ద అండర్‌ బ్రిడ్జి పనులు చేపట్టడం వల్ల రైల్వే గేటు మూసివేస్తారని, దీని వల్ల ఆరు గ్రామాల ప్రజలు రహదారి సదుపాయం కోల్పోతామంటూ గ్రామ పెద్దలు వాపో యారు.

రైల్వే గేటు మూయవద్దని వినతి
రైల్వే అధికారికి వినతి పత్రం అందిస్తున్న గ్రామ పెద్దలు

నక్కపల్లి, నవంబరు 5: పెదబోదిగల్లం ముస్లిం గ్రామానికి ఆనుకుని ఉన్న రైల్వేగేటు వద్ద అండర్‌ బ్రిడ్జి పనులు చేపట్టడం వల్ల రైల్వే గేటు మూసివేస్తారని, దీని వల్ల ఆరు గ్రామాల ప్రజలు రహదారి సదుపాయం కోల్పోతామంటూ గ్రామ పెద్దలు వాపో యారు. ఈ పరిస్థితుల్లో రైల్వేగేటును మూయవద్దని కోరుతూ రైల్వే శాఖాధికారులను కోరారు. గురువారం పెదబోదిగల్లం రైల్వే గేటును పరిశీలించేందుకు విజయవాడ నుంచి వచ్చిన రైల్వే ఉన్నతాధికారి డీఎన్‌ రమణారావుకు ముస్లిం మత పెద్దలు, గ్రామస్థులు డీసీసీబీ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ సమక్షంలో వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఆయన రెండు లైన్లలో 16 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో అండర్‌ గ్రౌండ్‌ బ్రిడ్జిలు నిర్మిస్తామని, ప్రజల రాకపోకలకు ఇబ్బందుల్లేకుండా సీసీ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - 2020-11-06T06:02:17+05:30 IST