-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Public hearing of Industrial carider
-
నేడు ప్రజాభిప్రాయ సేకరణ
ABN , First Publish Date - 2020-11-25T06:42:25+05:30 IST
విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ లో భాగంగా పలు పరిశ్రమల ఏర్పాటుకు రాజయ్యపేటలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది.

నక్కపల్లి, నవంబరు 24: విశాఖ-చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ లో భాగంగా పలు పరిశ్రమల ఏర్పాటుకు రాజయ్యపేటలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఇందుకు సంబంధించి ఏపీఐఐసీ, జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వ ర్యంలో ఏర్పాట్లు చేశారు. రాజయ్యపేట, చందనాడ, వేంపాడు, డీఎల్‌పురం, బుచ్చిరాజుపేట సహా పలు గ్రామాల ప్రజలు, రైతులు, టీడీపీ, వైసీపీ, సీపీఎం నేతలు హాజరుకానున్నారు. వారు సభా వేదిక వైపు దూసుకురాకుండా పటిష్టమైన బారికేడ్లను నిర్మిం చారు. జిల్లాలోని పలు సర్కిళ్ల నుంచి సుమారు 200 మంది పోలీసులను మోహరించనున్నట్టు తెలిసింది.