-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » ptd bus
-
పీటీడీకి రికార్డు ఆదాయం
ABN , First Publish Date - 2020-12-30T05:38:49+05:30 IST
ప్రజా రవాణాశాఖ(పీటీడీ) విశాఖ రీజియన్ రికార్డు స్థాయి ఆదాయం సంపాదించింది.

77 శాతం ఓఆర్..రూ.1.06 కోట్లు జమ
ద్వారకాబస్‌స్టేషన్, డిసెంబరు 29: ప్రజా రవాణాశాఖ(పీటీడీ) విశాఖ రీజియన్ రికార్డు స్థాయి ఆదాయం సంపాదించింది. కొవిడ్-19 లాక్‌డౌన్ తరువాత సోమవారం రూ.1.06 కోట్లు ఆదాయం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. 805 బస్సులు 77 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో 2,80,000 కిలో మీటర్ల దూరం నడపడం వల్ల ఈ ఆదాయం వచ్చినట్టు అధికారులు వివరించారు. లాక్‌డౌన్‌కు ముందు 1064 బస్సులు మూడున్నర లక్షల కిలోమీటర్లు తిప్పితే 62 శాతం నుంచి 64 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదై కోటి రూపాయలు ఆదాయం వచ్చేదని వివరించారు. ఇప్పుడు దాన్ని అధిగమించడం జరిగిందన్నారు. విశాఖ రీజియన్‌లోని ప్రయాణికులు పీటీడీ బస్సులు ఆదరించడం వల్లే ఇంత మొత్తంలో రోజువారీ ఆదాయం వచ్చిందని డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ సుధాబిందు తెలిపారు. క్రిస్మస్ తిరుగు ప్రయాణికులు, శుభకార్యాలకు రాకపోకలు సాగించే వారు పీటీడీని ఆదరించారని ఆమె పేర్కొన్నారు.