ఘనంగా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం
ABN , First Publish Date - 2020-12-29T05:37:39+05:30 IST
కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమ వారం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి ఆడారి రమేశ్‌నాయుడు ఆధ్వర్యంలో పెందుర్తిలో నిర్వహించారు.
పెందుర్తి, డిసెంబరు 28: కాంగ్రెస్ పార్టీ 136వ ఆవిర్భావ దినోత్సవాన్ని సోమ వారం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి ఆడారి రమేశ్‌నాయుడు ఆధ్వర్యంలో పెందుర్తిలో నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా అధ్యక్షు డు రుత్తల శ్రీరామ్మూర్తి హాజరై కూడలిలోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ని వాళులు అర్పించారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ షఫీఉల్లా, లక్ష్మోజీ, రమణమ్మ, మణికంఠ పాల్గొన్నారు.
గాజువాకలో...
గాజువాక: కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సోమవారం గాజువాకలో ఘనంగా నిర్వహించారు. పీసీసీ కార్యదర్శి జెర్రిపోతుల ముత్యాలు, ఎలమంచిలి సన్యాసిరావు, సాహెబ్‌నాయుడు, అప్పారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.