-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Proudly Brucely Jubilee
-
ఘనంగా బ్రూస్లీ జయంతి
ABN , First Publish Date - 2020-11-28T05:01:26+05:30 IST
మార్షల్‌ఆర్ట్స్‌లో చిన్న వయసులోనే బ్రూస్లీ ప్రపంచ ప్రఖ్యాతి నొందారని ఏపీ అమెచ్యూర్ తైక్వాండో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆనంద్ అన్నారు.

కొమ్మాది, నవంబరు 27: మార్షల్‌ఆర్ట్స్‌లో చిన్న వయసులోనే బ్రూస్లీ ప్రపంచ ప్రఖ్యాతి నొందారని ఏపీ అమెచ్యూర్ తైక్వాండో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఆనంద్ అన్నారు. వైజాగ్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం మధురవాడలో బ్రూస్లీ 80వ జయంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్ క్లాసుల ద్వారా ప్రతిభ కనబరిచిన కృపా సత్యనారాయణ, చైతన్యదుర్గ, ప్రకాశ్, హరీశ్, నిఖిల్‌లకు మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో తైక్వాండో మహిళా శిక్షకురాలు ఎ.పూర్ణిమలక్ష్మి, ఎ.పవన్‌కుమార్, హేమంత్‌శ్రీనాఽథ్ పాల్గొన్నారు.