‘పదో తరగతి పరీక్షలకు రక్షణ చర్యలు చేపట్టాలి’

ABN , First Publish Date - 2020-05-18T09:12:06+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు నిర్వహించే సమయంలో రక్షణ చర్యలు చేపట్టాలని ఏపీ విద్యాశాఖ మంత్రి

‘పదో తరగతి పరీక్షలకు రక్షణ చర్యలు చేపట్టాలి’

సిరిపురం: రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు నిర్వహించే సమయంలో రక్షణ చర్యలు చేపట్టాలని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు బాల వికాస్‌ ఫౌండేషన్‌ కార్యదర్శి నరవ ప్రకాశరావు లేఖ రాశారు. బాలల ఆరోగ్య రక్షణ కోసం కనీస చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లను ఇప్పటికే క్వారంటైన్‌ కేంద్రాలుగా వినియోగిస్తున్నారని, ఈ కేంద్రాలను పరీక్షల నిర్వహణకు సురక్షితంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పరీక్షలకు ముందుగానే ఆయా కేంద్రాలను శానిటైజేషన్‌ చేయాలన్నారు. పరీక్ష రాయడానికి అనువుగా బల్లలు, కుర్చీలు, గాలి, వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని, మాస్క్‌లు, భౌతిక దూరం నిబంధనలు పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు.

Updated Date - 2020-05-18T09:12:06+05:30 IST