కేంద్ర నిర్ణయంపై ప్రైవేటు వైద్యులు నిరసన
ABN , First Publish Date - 2020-12-12T04:51:58+05:30 IST
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇక్కడి ఐఎంఏ కార్యాలయం వద్ద ప్రైవేటు వైద్యులు శుక్రవారం నిరసన తెలిపారు.
నర్సీపట్నం, డిసెంబరు 11 : కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇక్కడి ఐఎంఏ కార్యాలయం వద్ద ప్రైవేటు వైద్యులు శుక్రవారం నిరసన తెలిపారు. అల్లోపతి వైద్యంలో ఆయుర్వేదం, హోమియోపతిని మిళితం చేసి వైద్య విధానం తీసుకొస్తుండడం తగదని సంఘం అధ్యక్షురాలు డాక్టర్ శ్రీదేవి అన్నారు. సీనియర్ వైద్యులు రాజశేఖర్, సూర్యనారాయణ, మడ్డు వెంకటరమణ, దాలయ్యనాయుడు, రామకృష్ణ, లక్ష్మీకాంత్, మారుతీకృష్ణ, వీఎన్‌జీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.