కేంద్ర కారాగారంలో మాస్క్‌ల తయారీ

ABN , First Publish Date - 2020-03-18T10:46:00+05:30 IST

నగరంలోని కేంద్ర కారాగారంలో కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందేందుకు మాస్క్‌లను తయారు చేస్తున్నట్టు జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌ తెలిపారు. కాటన్‌ వస్త్రాలతో మాస్క్‌ల

కేంద్ర కారాగారంలో మాస్క్‌ల తయారీ

రోజుకు 500 తయారు చేసేందుకు సన్నాహాలు

తొలుత జైలులోని ఖైదీలు, సిబ్బందికి పంపిణీ

మిగిలినవి ఒక్కొక్కటి రూ.16కు విక్రయిస్తాం 

ఇప్పటికే జీవీఎంసీ నుంచి ఆర్డర్‌ వచ్చింది

జైలు సూపరింటెండెంట్‌ రాహుల్‌


ఆరిలోవ, మార్చి 17:  నగరంలోని కేంద్ర కారాగారంలో కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందేందుకు మాస్క్‌లను తయారు చేస్తున్నట్టు జైలు సూపరింటెండెంట్‌ ఎస్‌.రాహుల్‌ తెలిపారు. కాటన్‌ వస్త్రాలతో మాస్క్‌ల తయారు చేసే ఖైదీలు నిమగ్నమయ్యారన్నారు. జైలులో రోజుకు 500 వరకు మాస్క్‌లను తయారుచేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని పేర్కొన్నారు. వీటిని ముందుగా జైలులోని ఖైదీలకు, సిబ్బందికి అందిస్తామని, ఆ తర్వాత మిగిలినవి విక్రయిస్తామన్నారు.


ఇప్పటికే జీవీఎంసీ నుంచి ఆర్డర్‌ కూడా వచ్చిందని ఆయన తెలిపారు. అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రాష్ట్రంలోని అన్ని కేంద్ర కారాగారాలకు సరఫరా చేస్తామన్నారు. నాణ్యతతో కూడిన ఒక్కో మాస్క్‌ను 16 రూపాయలకు విక్రయిస్తామని, బహిరంగ మార్కెట్లో కంటే ధర తక్కువే కాబట్టి వీటికి డిమాండ్‌ ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-03-18T10:46:00+05:30 IST