భావి తరాలకోసం ‘ప్రగతి భారత్‌’

ABN , First Publish Date - 2020-11-01T04:51:24+05:30 IST

భావితరాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని కుల మత రాజకీయాలకు అతీతంగా సేవాదృక్పథంతో ఏర్పాటుచేసిన ట్రస్టు ‘ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌’ అని, ట్రస్టు ఆధ్వర్యంలో భవిష్యత్తు తరాలకు పయోగపడే కార్యక్రమాలు చేపడతామని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు.

భావి తరాలకోసం ‘ప్రగతి భారత్‌’
కేక్‌ కట్‌ చేస్తున్న కలెక్టర్‌ వినయ్‌చంద్‌

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి

మహారాణిపేట, అక్టోబరు 31: భావితరాల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని కుల మత రాజకీయాలకు అతీతంగా సేవాదృక్పథంతో ఏర్పాటుచేసిన ట్రస్టు ‘ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌’ అని, ట్రస్టు ఆధ్వర్యంలో భవిష్యత్తు తరాలకు పయోగపడే కార్యక్రమాలు చేపడతామని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. ఫౌండేషన్‌ ప్రథమ వార్షికోత్సవ సమావేశాన్ని శనివారం హోటల్‌ గ్రాండ్‌బేలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారి బంగారు భవిష్యత్తుకు ట్రస్టు కృషి చేస్తుందని, వారికి ఉద్యోగం వచ్చేవరకు బాధ్యత వహిస్తుందని తెలిపారు. క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమం కింద జిల్లాలో ఉన్న 230 నీటి వనరులు కాలుష్యం బారిన పడకుండా కార్పొరేట్‌ సంస్థల సహకారంతో రక్షణ కల్పిస్తామని తెలిపారు.

బీచ్‌ రోడ్డులో వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌

ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బీచ్‌ రోడ్డులో వాకింగ్‌, సైక్లింగ్‌ ట్రాక్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు విజయసాయిరెడ్డి వెల్లడించారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ ట్రస్టు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు తిప్పలనాగిరెడ్డి, అదీప్‌రాజ్‌, వాసుపల్లి గణేశ్‌కుమార్‌, కలెక్టర్‌ వినయ్‌చంద్‌, గ్రేటర్‌ కమిషనర్‌ జి.సృజన, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-01T04:51:24+05:30 IST