నేడు విశాఖలో రాజకీయ మేధోమథన రౌండ్‌ టేబుల్‌ సమావేశం

ABN , First Publish Date - 2020-12-20T05:53:30+05:30 IST

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ఆదివారం విశాఖలో రాజకీయ మేధోమథన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్టు ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.శంకరరావు తెలి పారు.

నేడు విశాఖలో రాజకీయ మేధోమథన రౌండ్‌ టేబుల్‌ సమావేశం
మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు

పాయకరావుపేట, డిసెంబరు 19 : బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ఆదివారం విశాఖలో రాజకీయ మేధోమథన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్టు ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.శంకరరావు తెలి పారు. శనివారం ఇక్కడ ఏర్పాటైన విలేఖర్ల సమా వేశంలో మాట్లాడుతూ  రాష్ట్ర జనాభాలో 80 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు గత ఏడు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోక, రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారన్నారు. పది శాతంగా ఉన్న ఆధిపత్య కులాల పార్టీలు ఇష్టానుసారంగా రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు.  ఈ తరుణంలో  రాజ్యాధికార సాధనే ప్రధాన లక్ష్యంగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇందులో భాగంగానే విశాఖలోని దొండపర్తిలో గల రైల్వే న్యూకాలనీ  సుబ్బలక్ష్మి కల్యాణ మండపంలో  రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జిలు జస్టిస్‌ శ్యామ్‌ప్రసాద్‌, జస్టిస్‌ బాలయోగి, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌, ప్రొఫెసర్‌ సాయన్నతో పాటు పలువురు మేధావులు, నాయకులు హాజరు కానున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో తుని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నెల్లిపూడి రాజుబాబు, బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు పక్కుర్తి గోవింద్‌, నెల్లిపూడి బ్రహ్మాజీ, పాయకరావుపేట కార్పెంటర్ల సంఘం నాయకులు  శ్రీను, నాగేశ్వరరావు, లక్కోజు శ్రీను, రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T05:53:30+05:30 IST