ట్రాఫిక్ ఉల్లంఘనులపై పోలీసులు స్పెషల్ డ్రైవ్
ABN , First Publish Date - 2020-07-19T10:07:38+05:30 IST
రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా నగర ట్రాఫిక్ పోలీసులు శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వన్‌వేలో

విశాఖపట్నం, జూలై 18(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా నగర ట్రాఫిక్ పోలీసులు శనివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వన్‌వేలో ప్రయాణిస్తున్నవారిపై కేసులు నమోదుచేసి జరిమానా విధించారు. మద్దిలపాలెం, ఆశీల్‌మెట్ట, ద్వారాకానగర్, జగదాంబ కూడలి, టౌన్‌కొత్తరోడ్డు, ఎన్‌ఏడీ జంక్షన్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఏడీసీపీ సీహెచ్ ఆదినారాయణ ఆధ్వర్యంలో సిబ్బంది స్పెషల్‌డ్రైవ్ నిర్వహించారు. వన్‌వేలో వచ్చిన 460 మంది వాహన చోదకులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున, రూ.4.60 లక్షలు అపరాధ రుసుం విధించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా వాహనచోదకులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఏడీసీపీ ఆదినారాయణ కోరారు.