విశాఖ రౌడీషీటర్ హత్య కేసు ఛేదించిన పోలీసులు

ABN , First Publish Date - 2020-12-29T00:47:44+05:30 IST

ఆరిలోవలో రౌడీషీటర్ సాయికుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. డిసెంబర్ 26న రాత్రి రౌడీషీటర్ సాయి కుమార్‌ను దారుణంగా హత్య చేశారని

విశాఖ రౌడీషీటర్ హత్య కేసు ఛేదించిన పోలీసులు

విశాఖ: ఆరిలోవలో రౌడీషీటర్ సాయికుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. డిసెంబర్ 26న రాత్రి రౌడీషీటర్ సాయి కుమార్‌ను దారుణంగా హత్య చేశారని ఏసీపీ ద్వారకా మూర్తి తెలిపారు. బైక్‌పై వెళ్తున్న రౌడీషీటర్ సాయిను అడ్డగించి రియాజ్, పండు ఇద్దరు రాడ్‌తో దాడి చేశారని తెలిపారు. ఈ కేసులో రియాజ్, బడ్డు, పండు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితుల్లో ఒకరు మైనర్ ఉన్నాడని పేర్కొన్నారు. రాడ్డులతో దాడి చేయడంతో రోడ్డుపై రౌడీషీటర్ కుప్పకూలినట్లు చెప్పుకొచ్చారు. చికిత్స కోసం స్థానికంగా ఉన్న పినకిల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడన్నారు. అందరి ముందు అవమానించడంతో కక్ష పెంచుకుని  హత్య చేశారని.. నిందితులపై రౌడీ షీట్ ఓపెన్ చేయనున్నట్లు ద్వారకా మూర్తి స్పష్టం చేశారు.

Updated Date - 2020-12-29T00:47:44+05:30 IST