పోలీసు జాగిలాల పనితీరు ప్రదర్శన

ABN , First Publish Date - 2020-12-05T05:40:57+05:30 IST

క్రైం కేసుల పరిష్కారంలో పోలీసులకు కీలక సహకారంగా ఉండే ‘జాగిలాల పనితీరు’ ప్రదర్శన శుక్రవారం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం మైదానంలో జరిగింది.

పోలీసు జాగిలాల పనితీరు ప్రదర్శన
జాగిలాలతో తనిఖీలు చేయిస్తున్న దృశ్యం

మహారాణిపేట, డిసెంబరు 4: క్రైం కేసుల పరిష్కారంలో పోలీసులకు కీలక సహకారంగా ఉండే ‘జాగిలాల పనితీరు’ ప్రదర్శన శుక్రవారం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయం మైదానంలో జరిగింది. పోలీసుల ఆధ్వర్యంలో మొత్తం 11 స్నిపర్‌ డాగ్స్‌, నాలుగు ట్రాకర్స్‌, రెండు నార్కోటిక్‌  జాగిలాలున్నాయి. అమరావతిలోని పోలీసు ప్రధాన కార్యాలయం ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ అధికారుల పర్యవేక్షణలో నగర పరిధిలోని పోలీసు విభాగాలో ఉన్న 17 జాగిలాల పనితీరును గమనించారు. నేరాల నియంత్రణల డాగ్స్‌ పాల్గొనే విధానాన్ని, క్లూలు అందించే విధానాన్ని ప్రదర్శించారు. నవ్యాంధ్ర ఆవిర్భావం తర్వాత ఇటువంటి ప్రదర్శన ఇదే మొదటిసారని పోలీసు అదికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్‌ ఐజీ శశిధర్‌, ఐఎస్‌డబ్ల్యూ ఆర్‌ఐ శ్రీనివాస్‌, వెటర్నరీ వైద్యుడు డాక్టర్‌ ప్రతాప్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.  


Updated Date - 2020-12-05T05:40:57+05:30 IST