పోలీసుల శ్రమదానం

ABN , First Publish Date - 2020-11-07T04:42:00+05:30 IST

నిత్యం తుపాకులు, లాఠీలతో కనిపించే పోలీసులు శుక్రవారం మండల కేంద్రంలో పలుగులు, పారలతో దర్శనమిచ్చారు.

పోలీసుల శ్రమదానం
మండల కేంద్రంలోని ప్రధాన రహదారిలో గోతులు పూడుస్తున్న సీఐ జీడీ.బాబు.

గోతులు పూడ్చిన సీఐ,ఎస్‌ఐలు, పోలీసులు

పాడేరురూరల్‌(జి.మాడుగుల), నవంబరు 6: నిత్యం తుపాకులు, లాఠీలతో కనిపించే పోలీసులు శుక్రవారం మండల కేంద్రంలో పలుగులు, పారలతో దర్శనమిచ్చారు. ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమన్న పోలీసు నినాదాన్ని స్థానిక సీఐ జీడీ.బాబు అమలులోకి తెచ్చారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండల కేంద్రంలోని రెండు కిలోమీటర్లు ప్రధాన రహదారి గతుకులమయంగా మారింది. ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న సీఐ జీడీ.బాబు, పోలీసులు, స్థానిక యువత సహకారంతో గతుకులు పూడ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ ఉపేంద్ర, ట్రైనీ ఎస్‌ఐ సాయికుమార్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-07T04:42:00+05:30 IST