సింహాచలంలో ‘పొగరున్నోడు’

ABN , First Publish Date - 2020-09-16T09:01:44+05:30 IST

యువ హీరో అఖిల్‌రెడ్డి, హీరోయిన్‌ రాశీసింగ్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘పొగరున్నోడు’ సినిమా షూటింగ్‌ సింహాచలంలో జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను మంగళవారం ఇక్కడ చిత్రీకరించారు. ప్రేమ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ను లాక్‌

సింహాచలంలో ‘పొగరున్నోడు’

సింహాచలం, సెప్టెంబరు 15: యువ హీరో అఖిల్‌రెడ్డి, హీరోయిన్‌ రాశీసింగ్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘పొగరున్నోడు’ సినిమా షూటింగ్‌ సింహాచలంలో జరిగింది. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను మంగళవారం ఇక్కడ చిత్రీకరించారు.


ప్రేమ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ను లాక్‌డౌన్‌కు ముందు విశాఖ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా జరిపామని... ఇప్పుడు నిబంధనలను సడలించడంతో మళ్లీ షూటింగ్‌ ప్రారంభించామని దర్శకుడు పద్మరాజ్‌ తెలిపారు. ప్రేమ సన్నివేశాలతో పాటు రెండు పాటలను భీమిలి, ఆర్కే బీచ్‌ వంటి సుందరమైన ప్రాంతాల్లో చిత్రీకరించామన్నారు. 

Updated Date - 2020-09-16T09:01:44+05:30 IST