కాంగ్రెస్‌ బలోపేతం కావాలి

ABN , First Publish Date - 2020-09-14T09:06:42+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని, ఇందుకోసం నాయకులు సమష్టిగా కృషి చేయాలని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్‌ బలోపేతం కావాలి

నాయకులు సమష్టిగా కృషి చేయాలి

పార్టీ శ్రేణులకు పీసీసీ చీఫ్‌ శైలజానాథ్‌ పిలుపు


విశాఖపట్నం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి) : కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని, ఇందుకోసం నాయకులు సమష్టిగా కృషి చేయాలని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌  పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  నగర పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్‌కు ఏళ్ల తరబడి అండగా నిలబడిన కొన్ని వర్గాలు గత రెండు ఎన్నికల్లో  పార్టీకి దూరమయ్యాయన్నారు. ముఖ్యంగా దళితులను పార్టీ వైపు ఆకర్షించేందుకు కృషి చేయాలని సూచించారు. ఎస్సీ సెల్‌ సమర్థంగా పని చేయాలని, ఆ వర్గం నాయకులకు పార్టీలో సముచిత ప్రాఽధాన్యం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి మాట్లాడుతూ, జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో పార్టీ నగర  అధ్యక్షుడు సంకు వెంకటేశ్వరరావు, నాయకులు చోడదాసి సుధాకర్‌, వజ్జపర్తి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 


 వాల్తేర్‌ డివిజన్‌ను చీల్చడం తగదు

వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ను రెండుగా చీల్చి,  ఆదాయాన్ని తీసుకువచ్చే ప్రాంతాలను రాయగడ డివిజన్‌లో కలపడం దారుణమని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ అన్నారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ,   ప్రస్తుతం వున్న వాల్తేర్‌ డివిజన్‌ను యథాతథంగా విశాఖ కేంద్రంగా ఏర్పడే రైల్వే జోన్‌లోనే వుంచాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-09-14T09:06:42+05:30 IST