వైభవంగా పసలతల్లి పండుగ

ABN , First Publish Date - 2020-12-14T05:18:55+05:30 IST

మండలంలోని ఇరువాడ, గొర్లివానిపాలెం గ్రామాల్లో ఆదివారం పసలతల్లి పండుగను వైభవంగా నిర్వహించారు.

వైభవంగా పసలతల్లి పండుగ
పసలతల్లికి పూజలు చేస్తున్న దృశ్యం

సబ్బవరం, డిసెంబరు 13: మండలంలోని ఇరువాడ, గొర్లివానిపాలెం గ్రామాల్లో ఆదివారం పసలతల్లి పండుగను  వైభవంగా నిర్వహించారు. ఇరువాడలోని పసలతల్లి పుట్ట వద్దకు అధిక సంఖ్యలో మహిళలు పసుపు, కుంకుమలతో వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. తమ పశువులు ఆరోగ్యంగా ఉండి పాడి, పంటలు సమృద్ధిగా ఉండాలని ఈ ప్రాంతవాసులు పసలతల్లికి మొక్కులు తీర్చడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో బలిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-14T05:18:55+05:30 IST