నక్కపల్లి ఆస్పత్రిలో కలకలం

ABN , First Publish Date - 2020-03-24T09:16:29+05:30 IST

నక్కపల్లి ముప్ఫై పడకల ఆస్పత్రిలో పనిచేసే వైద్య సిబ్బంది ఒక్కసారిగా ఆందోళన చెందారు. సోమవారం ఉదయం ఒక రోగి (గుర్తు తెలియని వ్యక్తి) తీవ్రమైన దగ్గు, జలుబు, జ్వరంతో ఆస్పత్రికి...

నక్కపల్లి ఆస్పత్రిలో కలకలం

  •  తీవ్రమైన దగ్గు, జలుబుతో గుర్తు తెలియని వ్యక్తి రాక
  • ఇక్కడ కరోనా పరీక్షా కేంద్రం వుందా..? అని ప్రశ్న
  •  వైద్యాధికారిని కలవమని చెప్పడంతో పరారీ

నక్కపల్లి, మార్చి 23 : నక్కపల్లి ముప్ఫై పడకల ఆస్పత్రిలో పనిచేసే వైద్య సిబ్బంది ఒక్కసారిగా ఆందోళన చెందారు. సోమవారం ఉదయం ఒక రోగి (గుర్తు తెలియని వ్యక్తి) తీవ్రమైన దగ్గు, జలుబు, జ్వరంతో ఆస్పత్రికి వచ్చాడు. ఇక్కడ కరోనా పరీక్షా కేంద్రం వుందా..? అని సిబ్బందిని అడిగాడు. నువ్వెక్కడి నుంచి వచ్చావని సిబ్బంది ప్రశ్నించారు. నేను తిరుపతి ప్రాంతానికి చెందిన వాడినని, మార్గమధ్యలో నిలిచిపోయాయని చెప్పేసరికి ఆస్పత్రిలో వున్న వైద్య సిబ్బంది భయాందోళన చెందారు. ఇక్కడ కరోనా పరీక్షా కేంద్రం లేదని, ఒకసారి వైద్యాధికారిని కలవమని చెప్పగా, అతను నిరాకరించి నిమిషాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతని కోసం సిబ్బంది గాలించినప్పటికీ ఆచూకీ కానరాలేనది సిబ్బంది చెప్పారు. అనంతరం ఆస్పత్రి ప్రాంగణాన్ని శానిటేషన్‌ చేపట్టారు

Read more