-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » pady raithu business
-
వరి నూర్పిడిలో రైతులు బిజీ
ABN , First Publish Date - 2020-11-28T05:23:08+05:30 IST
ఎంతో ఆశాజనకంగా పండిన వరి చేను వర్షం కారణంగా నీటమునిగి రైతుల ఆశలను ఆవిరిజేసింది. అయితే వరి పంటను కోసి పనలను పొలాల్లోనే ఉంచడంతో వర్షానికి తడిసి ముద్దయ్యాయి.

వర్షంతో కొంతమేర పంట నష్టం
మాడుగుల, నవంబరు 27: ఎంతో ఆశాజనకంగా పండిన వరి చేను వర్షం కారణంగా నీటమునిగి రైతుల ఆశలను ఆవిరిజేసింది. అయితే వరి పంటను కోసి పనలను పొలాల్లోనే ఉంచడంతో వర్షానికి తడిసి ముద్దయ్యాయి. శుక్రవారం వర్షం తెరిపివ్వడంతో రైతులు నూర్పుడి చేస్తున్నారు. వర్షానికి కోసిన చేను తడిసి ముద్దయిన కారణంగా ఆశించినంత పంట చేతికి రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వాటిల్లిన నష్టానికి తగిన పరిహారం అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.