-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » pady damage
-
1300 ఎకరాల్లో వరి పంట నష్టం
ABN , First Publish Date - 2020-11-28T05:09:39+05:30 IST
నివర్ తుఫాన్ ప్రభావంతో మండలంలో కురుస్తున్న వర్షాల కారణంగా వరి పంటకు నష్టం వాటిల్లింది. మండలంలో 1300 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు ఏవో నిర్మలజ్యోతి తెలిపారు.

వ్యవసాయాధికారుల ప్రాథమిక అంచనా
మాడుగుల రూరల్. నవంబరు 27: నివర్ తుఫాన్ ప్రభావంతో మండలంలో కురుస్తున్న వర్షాల కారణంగా వరి పంటకు నష్టం వాటిల్లింది. మండలంలో 1300 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు ఏవో నిర్మలజ్యోతి తెలిపారు. ఈనెల 22 తేదీన కురిసిన వర్షానికి 200 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమిక అంచనా వేసినట్టు తెలిపారు. తాజాగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 1300 ఎకరాల్లో వరి పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయాధికారులు గుర్తించారు. మాడుగుల, కేజేపురం, ముకుందపురం, వంటర్లపాలెం, సాగరం, సురవరం, వీరవిల్లి అగ్రహారం, తదితర గ్రామాల్లో వరిచేను నేలకొరింది. వర్షం నీటికి ముంపునకు గురైంది. కోసిన వరి పనలు పొలంలో ఉండిపోవడంతో తడిసి ముద్దయ్యాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు నష్టాన్ని చవిచూపుతున్నాయి.