-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Organic methods are beneficial in vegetable cultivation
-
కూరగాయల సాగులో సేంద్రియ పద్ధతులు మేలు
ABN , First Publish Date - 2020-12-30T05:42:50+05:30 IST
కూరగాయల సాగులో సేంద్రియ పద్ధతులు మేలు చేకూరుస్తాయని బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్రప్రసాద్ చెప్పారు.

సస్యరక్షణ శాస్త్రవేత్త నాగేంద్రప్రసాద్
మునగపాక, డిసెంబరు 29: కూరగాయల సాగులో సేంద్రియ పద్ధతులు మేలు చేకూరుస్తాయని బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం సస్యరక్షణ శాస్త్రవేత్త బండి నాగేంద్రప్రసాద్ చెప్పారు. నాగవరం గ్రామంలో కూరగాయల్లో వేస్ట్ డీ కంపోజర్ వాడకంపై మంగళవారం సదస్సు జరిగింది. పొలంలోని వ్యర్థాలతో సేంద్రియ ఎరువులను తయారు చేసుకునే విధానాన్ని ఆయన చేసి చూపించారు. ఈ విధానం చాలా సులభమని వివరించారు. 20 మంది రైతులకు వేస్ట్ డీ కంపోజర్ ద్రావణాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో వలంటీర్లు, రైతులు పాల్గొన్నారు.