భెల్‌లో యునైటెడ్ ఫ్రంట్ కార్యాలయం ప్రారంభం
ABN , First Publish Date - 2020-12-18T05:05:24+05:30 IST
కార్మిక సమస్యలను పరిష్కరించి భెల్ అభివృద్ధిలో ఏఐటీయూసీ ముందుంటుందని సంఘం జిల్లా అధ్యక్షుడు పడాల రమణ అన్నారు.

అక్కిరెడ్డిపాలెం, డిసెంబరు 17: కార్మిక సమస్యలను పరిష్కరించి భెల్ అభివృద్ధిలో ఏఐటీయూసీ ముందుంటుందని సంఘం జిల్లా అధ్యక్షుడు పడాల రమణ అన్నారు. భెల్ హెచ్‌పీవీపీలో గత నెల జరిగిన గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన యునైటెడ్ ఫ్రంట్ నూతన యూనియన్ కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మిక సమస్యలను పరిష్కరించడంలో ముందుంటామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు విళ్లా రామ్‌మోహన్‌కుమార్, యునైటెడ్ ఫ్రంట్ నాయకులు అలమండ వెంకటేశ్వరరావు, రాజు, సాహు, సుధాకర్, నరసింగరావు, శుభకర్, వెంకటరావు పాల్గొన్నారు.