సహకార సంఘాల్లో ఆన్‌లైన్‌ సేవలు

ABN , First Publish Date - 2020-07-27T11:34:47+05:30 IST

జిల్లాలోని అన్ని ప్రాథమిక సహకార సంఘాల్లో ఆన్‌లైన్‌ సేవలు ప్రారంభిస్తామని, ఈ ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తవుతుందని

సహకార సంఘాల్లో ఆన్‌లైన్‌ సేవలు

ఆరు నెలల్లో ప్రారంభం 

2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,350 కోట్ల టర్నోవర్‌, రూ.36.63 లక్షల లాభం

రుణ వసూళ్ల గడువు సెప్టెంబరు వరకు పొడిగింపు

మహాజన సభలో డీసీసీబీ చైర్‌పర్సన్‌ ఇన్‌చార్జి సుకుమారవర్మ


విశాఖపట్నం, జూలై 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అన్ని ప్రాథమిక సహకార సంఘాల్లో ఆన్‌లైన్‌ సేవలు ప్రారంభిస్తామని, ఈ ప్రక్రియ ఆరు నెలల్లో పూర్తవుతుందని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) చైర్‌పర్సన్‌ ఇన్‌చార్జి ఉప్పలపాటి సుకుమారవర్మ తెలిపారు. ఆదివారం విశాఖలోని బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన మహాజన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో సహకార సంఘాలను కంప్యూటరీకరిస్తున్నామని, దీంతో ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌ చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రూ.1,350 కోట్ల వ్యాపారం చేసిందన్నారు.


రూ.850 కోట్ల డిపాజిట్లు సేకరించామని, రూ.36.63 లక్షల నికర లాభాన్ని ఆర్జించామన్నారు. కొవిడ్‌-19 నేపథ్యంలో రుణాల వసూళ్లకు సెప్టెంబరు వరకు ప్రభుత్వం గడువు ఇచ్చిందన్నారు. ఖరీఫ్‌ రుణాల పంపిణీ వేగవంతం చేయాలని సూచించారు. మహాజన సభలో డీసీసీబీ సీఈవో డీవీఎస్‌వర్మ, జనరల్‌ మేనేజర్‌ అన్నపూర్ణ, ఇతర అధికారులు, జిల్లాలోన వివిధ బ్యాంకు బ్రాంచీల నుంచి స్థానిక అధికారులు, సహకార సంఘాల పర్సన్‌ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-27T11:34:47+05:30 IST