నేటి నుంచి టెన్త్ విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు
ABN , First Publish Date - 2020-04-08T10:10:41+05:30 IST
కరోనా నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించినందున పదవ తరగతి విద్యార్థులకు బుధవారం నుంచి ఆన్లైన్లో

భీమునిపట్నం (రూరల్): కరోనా నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించినందున పదవ తరగతి విద్యార్థులకు బుధవారం నుంచి ఆన్లైన్లో పాఠాలను బోఽధించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దూరదర్శన్ సప్తగిరి చానల్లో ప్రతి రోజూ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఈ తరగతులు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది. పదవ తరగతి విద్యార్థ్ధులకు ఇంకా పరీక్షలు జరగనందున వివిధ సబ్జెక్టులపై అవగాహన కల్పించడానికి ఈ ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.