కొనసాగుతున్న సెయిల్‌ కార్మికుల నిరసన

ABN , First Publish Date - 2020-12-04T04:27:22+05:30 IST

తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ స్టీల్‌ అఽథారిటీ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) కార్మికులు చేపట్టిన నిరసన కొనసాగుతోంది.

కొనసాగుతున్న సెయిల్‌ కార్మికుల నిరసన
సెయిల్‌ వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులు

ఆటోనగర్‌, డిసెంబరు 3: తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ స్టీల్‌ అఽథారిటీ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) కార్మికులు చేపట్టిన నిరసన కొనసాగుతోంది.  అర్ధంతరంగా తొలగించిన 40 మంది కార్మికులను విధుల్లోకి తీసుకుని, ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. పది రోజులు గా పరిశ్రమ గేటు ఎదుట ఆందోళన చేస్తున్నా బాధితులను పట్టించుకోని యాజమాన్యం చర్యలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T04:27:22+05:30 IST