భవనం పైనుంచి పడి కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2020-12-25T05:51:59+05:30 IST

ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కాలు జారి పడి ఓ కార్మికుడు మృతి చెందాడు.

భవనం పైనుంచి పడి కార్మికుడి మృతి

కొమ్మాది, డిసెంబరు 24: ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కాలు జారి  పడి ఓ కార్మికుడు మృతి చెందాడు. పీఎంపాలెం సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం మారికవలస పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఓ ఇంటిగ్రేటెడ్‌ సంస్థ నిర్మిస్తున్న బహుళ అంతస్థుల భవన నిర్మాణంలో శ్రీకాకుళం జిల్లా మందస గ్రామానికి చెందిన సవర ముకుంద (32) గురువారం ఉదయం శ్లాబ్‌ నిర్మాణ పనులు చేస్తూ అదుపు తప్పి పడిపోవడంతో మృతిచెందాడు. మృతుడి బావ రామ్మూర్తి ఫిర్యాదు మేరకు ఎస్‌.ఐ శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి చేస్తున్నారు.

Updated Date - 2020-12-25T05:51:59+05:30 IST