పాఠశాల పూర్వ విద్యార్థుల ఔదార్యం
ABN , First Publish Date - 2020-12-31T04:58:34+05:30 IST
మండలంలోని రావలమ్మపాలెం ఉన్నత పాఠశాల 1998-99 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు తమ ఔదార్యం చాటుకు న్నారు.

సబ్బవరం, డిసెంబరు 30: మండలంలోని రావలమ్మపాలెం ఉన్నత పాఠశాల 1998-99 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు తమ ఔదార్యం చాటుకు న్నారు. తమతో కలసి చదువుకున్న రాజాన సత్యవతి (38) ఈనెల 15న అనారోగ్యంతో మృతిచెందింది. ఆమె భర్త కూడా నాలుగేళ్ల కిందటే మృతిచెందగా వారి కుమార్తెలు లోహిత, మానస అనాథలుగా మిగిలారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన సత్యవతి స్నేహితులు రూ.90 వేలను వారి పేరున చెరో రూ.45 వేలు బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి పాస్ పుస్తకాలను బుధవారం వారికి అందజేశారు. కార్యక్రమంలో సబ్బవరపు రామకృష్ణ, శీరంరెడ్డి రామకృష్ణ, గొంప రమణమూర్తి, సబ్బవరపు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.