ద్విచక్రవాహనం ఢీకొని వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2020-11-04T05:01:07+05:30 IST

ద్విచక్రవాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు, చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ద్విచక్రవాహనం ఢీకొని వృద్ధుడి మృతి
మృతి చెందిన చిన్నయ్య


హుకుంపేట, నవంబరు 3: ద్విచక్రవాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు, చికిత్స పొందుతూ మృతిచెందాడు. మండలంలోని సూకూరు పంచాయతీ బిర్సింగి గ్రామానికి చెందిన తూబురు చిన్నయ్య(60) సోమవారం రాత్రి ఏడు గంటల సమయంలో సూకూరు నుంచి బిర్సింగి వెళుతుండగా.... బాకూరు నుంచి సూకూరు వైపు వెళుతున్న ద్విచక్రవాహనం ఢీకొంది. దీంతో చిన్నయ్యకు తలపై బలమైన గాయమైంది. చికిత్స నిమిత్తం పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఎస్‌ఐ షేక్‌ నజీర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2020-11-04T05:01:07+05:30 IST