పురాతన భవనాల కూల్చివేత

ABN , First Publish Date - 2020-12-03T05:31:47+05:30 IST

పట్టణంలో పురాతన భవనాల కూల్చివేత పనులను బుధవారం ప్రారంభించారు.

పురాతన భవనాల కూల్చివేత
పురాతన భవనం కూల్చివేస్తున్న దృశ్యం

అనకాపల్లి, డిసెంబరు 2: పట్టణంలో పురాతన భవనాల కూల్చివేత పనులను బుధవారం ప్రారంభించారు. పాత బస్టాండ్‌ రోడ్డులో కూలిపోయిన భవన సముదాయంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. జోనల్‌ అధికారులు దగ్గరు ఉండి కూల్చివేస్తున్నారు. ఈ సందర్భంగా జోనల్‌ కమిషనర్‌ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, పట్టణంలో 153 పురాతన భవనాలను గుర్తించామన్నారు. ఈ భవనాల్లో ఉంటున్న వారిని ఖాళీ చేయించేందుకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ పడిపోయే స్థితిలో ఉన్న భవనాల్లో నివాసం ఉండేందుకు అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-03T05:31:47+05:30 IST