ఆగని కరోనా

ABN , First Publish Date - 2020-09-12T10:00:41+05:30 IST

జిల్లాలో మరో 413 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 43,561కు చేరింది. ఇందులో వైరస్‌ నుంచి కోలుకుని 37,860 మంది డిశ్చార్జ్‌ కా

ఆగని కరోనా

మరో 413 మందికి పాజిటివ్‌

43,561కు చేరిన కేసులు

చికిత్స పొందుతూ మరో ఆరుగురి మృతి

316కు చేరిన మృతుల సంఖ్య


విశాఖపట్నం, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో మరో 413 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 43,561కు చేరింది. ఇందులో వైరస్‌ నుంచి కోలుకుని 37,860 మంది డిశ్చార్జ్‌ కాగా, మరో 5,385 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్‌తో చికిత్స పొందుతూ శుక్రవారం మరో ఆరుగురు మృతి చెందడంతో మరణాలు 316కు చేరాయి.

 

సింహాచలంలో 16..: సింహాచలం గ్రామీణ ఆరోగ్య కేంద్రం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన వారికి పరీక్షలు నిర్వహించగా 16 మందికి పాజిటివ్‌ వచ్చింది. 


ఆరిలోవలో 13..: ఆరిలోవ రిఫరల్‌ వైద్యశాలలో 240 మందికి పరీక్షలు నిర్వహించగా 13 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మరో 69 మంది ఫలితాలు రావాల్సి ఉంది.  


69వ వార్డులో 10..: జీవీఏంసీ 69వ వార్డు పరిధిలో పది కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రహ్లాదపురం సమీపంలోని సింహాద్రినగర్‌, నాయుడుతోట రవినగర్‌, అప్పలనర్సయ్య కాలనీల్లో రెండేసి, సాయిదుర్గానగర్‌, ఆంజనాద్రి కాలనీ, వేపగుంట, ముత్యమాంబ కాలనీల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. 


కూర్మన్నపాలెంలో 10..: జీవీఎంసీ 86, 87 వార్డుల్లో మరో పది పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 86వ వార్డు వడ్లపూడి, కణితిలో 16 మందికి పరీక్షలు చేయగా ముగ్గురికి, 87వ వార్డులో 56 మందికి పరీక్షలు చేయగా ఏడుగురికి పాజిటివ్‌ తేలింది. 


జిల్లాలో మరో 413 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 43,561కు చేరింది. ఇందులో వైరస్‌ నుంచి కోలుకుని 37,860 మంది డిశ్చార్జ్‌ కా మండల పరిధిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. స్థానిక జేఎన్‌ఎన్‌యూ ఆర్‌ఎం కాలనీకి చెందిన తండ్రీ, కూతురితోపాటు తిక్కవానిపాలేనికి చెందిన మరో వ్యక్తికి వైరస్‌ సోకింది. 


జిల్లాలో మరో 413 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 43,561కు చేరింది. ఇందులో వైరస్‌ నుంచి కోలుకుని 37,860 మంది డిశ్చార్జ్‌ కాజిల్లాలో మరో 413 మందికి కొవిడ్‌-19 పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 43,561కు చేరింది. ఇందులో వైరస్‌ నుంచి కోలుకుని 37,860 మంది డిశ్చార్జ్‌కా.


పాడేరు: ఏజెన్సీలో శుక్రవారం 243 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 14 మందికి పాజిటివ్‌ వచ్చిందని ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌ తెలిపారు. కొయ్యూరు మండలంలో నాలుగు, పాడేరులో నాలుగు, చింతపల్లిలో మూడు, అనంతగిరిలో రెండు, హుకుంపేటలో ఒకటి కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. 


కశింకోటలో 9...: మండలంలో తొమ్మిది కరోనా కేసులు నమోదయ్యాయని వైద్యాధికారి బి.రాజశేఖర్‌ చెప్పారు. కశింకోట పూసర్లవీధిలో వివాహిత, అఫీషియల్‌ కాలనీలో యువతి, సత్తెమ్మ కాలనీలో యువకుడు, వెదురుపర్తిలో యువకుడు, వివాహిత, శారదా నగర్‌లో యువకుడు, కొత్తూరుదేవినగర్‌లో వివాహిత, ఎన్జీవో కాలనీలో పురుషుడు, సంపతిపురంలో వృద్ధుడు కరోనా బారినపడ్డారని ఆయన చెప్పారు.


‘పేట’లో 8...: పాయకరావుపేట మండలంలో శుక్రవారం ఎనిమిది మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. పట్టణంలోని జీవీఆర్‌ నగర్‌లో పురుషుడు, మహిళ, కరణంగారి వీధిలో ఇద్దరు పురుషులు, పోలీస్‌ క్వార్టర్స్‌లో పురుషుడు, జగతావారి వీధిలో పురుషుడు, శ్రీరాంపురం పీహెచ్‌సీలో ఉద్యోగిని, అదే గ్రామంలో యువకుడు వైరస్‌బారిన పడ్డారు. 


అనకాపల్లిలో 2...: అనకాపల్లి ప్రాంతంలో శుక్రవారం రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తుమ్మపాల పంచాయతీ చినబాబు కాలనీకి చెందిన యువతి, యల్లారమ్మతోటలో వృద్ధుడు కరోనా బారినపడ్డారు.


 ఏఎల్‌ పురంలో 2...: గొలుగొండ మండలం ఏఎల్‌పురంలో ఇద్దరికి కరోనా సోకింది. ఎస్సీ కాలనీలో వృద్ధుడు, మహిళ వైరస్‌ బారినపడ్డారు.


మాకవరపాలెంంలో 2...: మండలంలో శుక్రవారం రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోడూరులో ఆర్‌ఎంపీ వైద్యుడు, గిడుతూరులో యువకుడు వైరస్‌ బారిన పడ్డారు.


కోటవురట్లలో 1...: మండలంలో చౌడువాడలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా రిపోర్ట్‌ వచ్చింది. ఆమెను నర్సీపట్నం కొవిడ్‌ కేర్‌ సెంటర్‌కు తరలించారు. 

Updated Date - 2020-09-12T10:00:41+05:30 IST