-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » Non stop rain in Anakapalli
-
అనకాపల్లిలో 25.2 ఎం.ఎం వర్షపాతం
ABN , First Publish Date - 2020-11-27T05:45:01+05:30 IST
నివర్ తుఫాన్ ప్రభావంతో అనకాపల్లిలో గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షపు జల్లులు కురుస్తూనే ఉన్నాయి.

అనకాపల్లి టౌన్, నవంబరు 26: నివర్ తుఫాన్ ప్రభావంతో అనకాపల్లిలో గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షపు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వర్షపాతం 25.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని రెవెన్యూ అధికారులు తెలిపారు. రహదారులపై అమ్మకాలు సాగించే చిరు వ్యాపారులు వర్షం కారణంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణంలోని మార్గాలన్నీ తడిసి ముద్దయ్యాయి.
కశింకోటలో...
కశింకోట: కశింకోటలో గురువారం ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో జనజీవనం స్తంభించింది. మండల కేంద్రంలో వారపు సంత తడిసి ముద్దయింది. రహదారులన్నీ జలమయమయ్యాయి.