ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉండండి

ABN , First Publish Date - 2020-12-30T05:55:53+05:30 IST

బ్రిటన్‌లో వెలుగుచూసిన కరోనా కొత్త స్ర్టెయిన్‌ గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా వుండాలని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ సూచించారు.

ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉండండి

అప్రమత్తంగా ఉండండి

కరోనా కొత్త స్ర్టెయిన్‌పై జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌

యూకే నుంచి వచ్చిన ప్రయాణికులకు,

వారితో కాంటాక్టు అయిన వారికీ పరీక్షలు


విశాఖపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): బ్రిటన్‌లో వెలుగుచూసిన కరోనా కొత్త స్ర్టెయిన్‌ గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా వుండాలని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ సూచించారు. ఆయన మంగళవారం ఉదయం తన ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ గత నెల రోజుల వ్యవధిలో యూకే నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను కేంద్ర ప్రభుత్వం జిల్లాలకు పంపించిందని తెలిపారు. విశాఖ జిల్లాకు 216 మంది ప్రయాణికులు రాగా, వీరిలో 209 మందిని గుర్తించామని, మరో ఏడుగురి ఆచూకీ లభిం చాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఆ 209 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 192 మందికి నెగెటివ్‌ వచ్చిందని, మరో 17 మంది ఫలితాలు రావాల్సి ఉందన్నారు. వీరితో కాంటాక్ట్‌ అయిన మరో 580 మం దిని గుర్తించి పరీక్షలు నిర్వహించగా, 390 మందికి నెగెటివ్‌ వచ్చిందని, మరో 190 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందన్నారు. వీరిలో ఎవరికైనా పాజిటివ్‌ వస్తే...వారి దగ్గర నుంచి మరోసారి నమూ నాలు సేకరించి కొత్త స్ర్టెయిన్‌ నిర్ధారణ కోసం పుణె, హైదరాబాద్‌లోని సీసీఎంబీ ల్యాబ్‌కు పంపిస్తామ న్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా వుండాలని, మాస్క్‌ వాడడం, భౌతిక దూరం పాటిం చడం ద్వారా వైరస్‌ బారినపడకుండా వుండవచ్చునని ఆయన సూచించారు.

Updated Date - 2020-12-30T05:55:53+05:30 IST