కార్యరూపం దాల్చని రిసాల్వ్‌ మెరైన్‌ నిపుణుల యత్నాలు

ABN , First Publish Date - 2020-11-16T04:51:57+05:30 IST

నగరంలోని తెన్నెటి పార్కు వద్ద తీరానికి కొట్టుకువచ్చిన నౌకను తిరిగి సముద్రంలోకి పంపేందుకు చేపడుతున్న పనులు కార్యరూపం దాల్చడం లేదు.

కార్యరూపం దాల్చని రిసాల్వ్‌ మెరైన్‌ నిపుణుల యత్నాలు

తీరం నుంచి కదలని బంగ్లాదేశ్‌ నౌక

విశాలాక్షినగర్‌, నవంబరు 15: నగరంలోని తెన్నెటి పార్కు వద్ద తీరానికి కొట్టుకువచ్చిన నౌకను తిరిగి సముద్రంలోకి పంపేందుకు చేపడుతున్న పనులు కార్యరూపం దాల్చడం లేదు. దీపావళి అమావాస్య నాడు సముద్రంలో నీటి పోటు అధికంగా ఉంటుంది కాబట్టి శనివారం రాత్రి బంగ్లాదేశ్‌ నౌకను సంద్రంలోకి పంపాలనే లక్ష్యంతో అధికారులు నౌక మరమ్మతుల్లో అనుభవం ఉన్న రిసాల్వ్‌ మెరైన్‌ నిపుణులను ముంబై నుంచి రప్పించారు. శనివారం రాత్రి వారు ఈ నౌకను సముద్రంలోకి తరలించేందుకు శతవిధాల యత్నించినా ఫలితం కానరాలేదు. దీంతో చేసేది లేక ముంబై నుంచి తీసుకువచ్చిన యంత్రాలను తిరిగి కంటైనర్లలో తరలించారు. 

Updated Date - 2020-11-16T04:51:57+05:30 IST