-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » NIVER
-
అప్రమత్తంగా ఉండండి
ABN , First Publish Date - 2020-11-27T05:43:03+05:30 IST
‘నివర్’ తుఫాన్ నేపథ్యంలో మత్య్సకారులు, తీర ప్రాంత నివాసితులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు పిలుపునిచ్చారు.

రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు
విశాలాక్షినగర్/భీమునిపట్నం, నవంబరు 26: ‘నివర్’ తుఫాన్ నేపథ్యంలో మత్య్సకారులు, తీర ప్రాంత నివాసితులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు పిలుపునిచ్చారు. గురువారం ఆయన జోడుగుళ్ల పాలెం, మంగమారిపేట తీర ప్రాంతాలను సందర్శించారు. తుఫాన్‌ను దృష్టిలో పెట్లుకుని మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ఆయన వెంట భీమిలి మత్స్యశాఖాధికారి శ్రీనివాసరావు, గ్రామ మత్స్యశాఖ సహాయకురాలు ఎన్.సుధ, గరికిన ఎల్లయ్య, ఐసీపీ నాయకులు స్వాతిదాస్, ఉమ్మడి దాస్ తదితరులు ఉన్నారు.