‘నివర్‌’ నష్టం తేలింది

ABN , First Publish Date - 2020-12-25T06:05:08+05:30 IST

జిల్లాలో గత నెలలో ‘నివర్‌’ తుఫాన్‌, భారీ వర్షాలు, వరదల కారణంగా 7,567.993 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించారు.

‘నివర్‌’ నష్టం తేలింది

7527.993 హెక్టార్లలో వరి, 40 ఎకరాల్లో చెరకు దెబ్బతిన్నట్టు నిర్ధారణ

8 31 మండలాల్లో 37,494 మంది రైతులకు నష్టం

హెక్టారుకి రూ.15 వేల చొప్పున ఇన్‌పుట్‌ సబ్సిడీ


విశాఖపట్నం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత నెలలో ‘నివర్‌’ తుఫాన్‌, భారీ వర్షాలు, వరదల కారణంగా 7,567.993 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించారు. దీనిలో 7,527.993 హెక్టార్లలో వరి, 40 హెక్టార్లలో చెరకు పంట వున్నాయని, మొత్తం 31 మండలాల్లో 37,494 మంది రైతులు నష్టపోయారని ప్రభుత్వానికి నివేదించారు. అత్యధికంగా ఎస్‌.రాయవరం మండలంలో 5,683 మంది రైతులకు చెందిన 1,406 హెక్టార్లలో వరి పంట పాడైపోయింది. అతితక్కువగా చింతపల్లి మండలంలో ఆరుగురు రైతులకు చెందిన 1.92 హెక్టార్ల పంట నష్టం వాటిల్లింది. ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద హెక్టారుకి రూ.15 వేల చొప్పున 7567.993 హెక్టార్లకు రూ.11,35,19,895 రైతులకు అందుతుందని అధికారులు వెల్లడించారు. పంట నష్టంపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపామని, ఆయా రైతుల బ్యాంకు ఖాతాలకు త్వరలో పరిహారం సొమ్ము జమ అవుతుందని వ్యవసాయ శాఖ జేడీ లీలావతి తెలిపారు.


మండలాల వారీగా నష్టపోయిన రైతులు, హెక్టార్లు....

ఎస్‌.రాయవరంలో 5,683 రైతులు-1406.188 హెక్టార్లు, భీమిలిలో 19-2.73, ఆనందపురంలో 3,090-80.762, పద్మనాభంలో 180-43.811, చోడవరంలో 169-70.233, చీడికాడలో 74-11.288, కె.కోటపాడులో  92- 12.98, దేవరాపల్లిలో 16-2.5, బుచ్చెయ్యపేటలో 2,591-387.66, అనకాపల్లిలో 3,009-549.923, మునగపాకలో 1,554-211.15, కశింకోటలో 1,723-266.748, పరవాడలో 166-28.96, పెందుర్తిలో 415-69.233, చింతపల్లిలో 6-1.92, జీకే.వీఽధిలో 50-22.005, కొయ్యూరులో 179-28.03, నర్సీపట్నంలో 304-62.34, రోలుగుంటలో 1291-221.94, గొలుగొండలో 442-122.658, రావికమతంలో 610-90.653, మాడుగులలో 2872- 430.917, ఎలమంచిలిలో 3,639-834.2, అచ్యుతాపురంలో 921-134.065, రాంబిల్లిలో 3,034-868.602, పాయకరావుపేటలో 2,030-375.4, నాతవరంలో 2,501-593.314, మాకవరపాలెంలో 361-59.53, కోటవురట్లలో 1,722-312.5, నక్కపల్లిలో 960-192.003. 

Updated Date - 2020-12-25T06:05:08+05:30 IST