-
-
Home » Andhra Pradesh » Visakhapatnam » nivar cyclone visakhapatnam
-
ఆరు గంటల్లో మరింత బలహీనపడనున్న ‘నివర్’
ABN , First Publish Date - 2020-11-27T13:18:44+05:30 IST
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుద్దుచ్చేరి రాష్ట్రాలను అతలాకుతలం చేసిన ‘నివర్’ తుఫాన్ క్రమంగా బలహీనపడింది.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుద్దుచ్చేరి రాష్ట్రాలను అతలాకుతలం చేసిన ‘నివర్’ తుఫాన్ క్రమంగా బలహీనపడింది. ప్రస్తుతం వాయుగుండంగా మారి రాయలసీమ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. రాబోయే ఆరు గంటల్లో క్రమంగా మరింత బలహీనపడే అవకాశం ఉందని..దీని ప్రభావంతో చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం, కర్నూలు జిల్లాలో పలుచోట్ల వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే... కొన్నిసార్లు 60 కిలోమీటర్ల వరకు కూడా గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మిగతా జిల్లాల్లో చాలా వరకు ఆకాశం మేఘావృతమై ఉండి చెదురుమదురుగా జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.