బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు
ABN , First Publish Date - 2020-12-30T04:58:53+05:30 IST
భవిష్యత్తు బంగారుయుగమని, ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలం ప్రతినిధి బీకే రామేశ్వరి అన్నారు.
డాబాగార్డెన్స్, డిసెంబరు 29: భవిష్యత్తు బంగారుయుగమని, ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండాలని ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలం ప్రతినిధి బీకే రామేశ్వరి అన్నారు. విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో డాబాగార్డెన్స్ వీజేఎఫ్‌లో మంగళవారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంచూరియన్ యూనివర్సిటీ వీసీ ఆచార్య జీఎస్‌ఎన్ రాజు హాజరై కేక్ కట్ చేసి బ్రహ్మకుమారీస్ నూతన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. జీవీఎంసీ అదనపు కమిషనర్ విశ్వనాథ సన్యాసిరావు, వీజేఎఫ్ అధ్యక్ష,కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, ఎస్.దుర్గారావు, సత్యవతి, ఆర్.నాగరాజుపట్నాయక్, సభ్యులు పాల్గొన్నారు.