ఏయూతో ఎన్‌సీసీ ఎంవోయూ

ABN , First Publish Date - 2020-12-30T05:28:53+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయంతో నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌ (ఎస్‌సీసీ) మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.

ఏయూతో ఎన్‌సీసీ ఎంవోయూ
వీసీ ప్రసాద్‌రెడ్డి సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న ఏయూ, ఎస్‌సీసీ ప్రతినిధులు

ఏయూ క్యాంపస్‌, డిసెంబరు 29: ఆంధ్ర విశ్వవిద్యాలయంతో నేషనల్‌ క్యాడెట్‌ కార్ప్స్‌ (ఎస్‌సీసీ) మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. వర్సిటీ వీసీ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌, ఎన్‌సీసీ గ్రూప్‌ కమాండర్‌ విశాఖ కెప్టెన్‌ నీరజ్‌ సిరోహిలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి వాటిని మార్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఎన్‌సీసీ అధికారులకు హ్యూమన్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా సర్టిఫికెట్లు  ప్రదానం చేసే దిశగా ఈ ఎంవోయూ నిలుస్తుందన్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో పనిచేస్తున్న ఎస్‌సీసీ అధికారులకు సర్వీస్‌ ట్రైనింగ్‌, ఐదేళ్ల ఉద్యోగ బాధ్యతలు పూర్తిచేసిన వారికి ఈ సర్టిఫికెట్లను అందజేయడం జరుగుతుందన్నారు. 

====

Updated Date - 2020-12-30T05:28:53+05:30 IST