ఆచారాల్లో ఆడంబరాలను విస్మరించండి
ABN , First Publish Date - 2020-12-13T05:56:05+05:30 IST
ఆచారాల్లో ఆడంబరాలను విస్మరించాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ రిటైర్డ్ వైస్ చాన్సలర్ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు సూచించారు.

నన్నయ యూనివర్సిటీ రిటైర్డ్ వైస్ చాన్సలర్ ముత్యాలనాయుడు
కొత్తూరు, డిసెంబరు 12: ఆచారాల్లో ఆడంబరాలను విస్మరించాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ రిటైర్డ్ వైస్ చాన్సలర్ ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు సూచించారు. కొత్తూరులోని విశ్వసమాఖ్య కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్థిక పరిస్థితులు మరిచిపోయి ఆడంబరాలకు పోవడం వల్ల మరింత పేదరికంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. ఆడపిల్లలకు కావాల్సింది అక్షర జ్ఞానంతో పాటు ఆత్మవిశ్వాసమని చెప్పారు. ఈ సందర్భంగా ఆచారాల్లో ఆడంబరాలు అవసరమా..? అనే కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆర్క్, సమరతా సేవా సంస్థల ప్రతినిధులు డి.ఎస్.ప్రసాద్, తవ్వా సన్యాసిశెట్టి, ఆడారి గంగాధర్, గంగుపాం నాగేశ్వరరావు, మరిపల్లి శోభ, శ్రీదేవి, హరి, ఆడారి సూరిబాబు పాల్గొన్నారు.