భక్తిశ్రద్ధలతో నాగులచవితి పూజలు

ABN , First Publish Date - 2020-11-19T05:39:20+05:30 IST

నగరంలో బుధవారం నాగుల చవితి వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. భక్తులు తమకు అందుబాటులో ఉన్న పుట్టల వద్దకు వెళ్లి అక్కడ బారులు తీరి మరీ పూజలు చేశారు.

భక్తిశ్రద్ధలతో నాగులచవితి పూజలు
ఏయూ ప్రాంగణంలోని పుట్టకు పూజలు చేస్తున్న భక్తులు

కుటుంబ సమేతంగా పుట్టలకు తరలివెళ్లిన భక్తులు

రంగవల్లికలతో పుట్టలు అలంకరణ

భక్తుల వాహనాలతో ఏయూ రోడ్డు రద్దీ

విశాఖపట్నం, నవంబరు 18: నగరంలో  బుధవారం నాగుల చవితి వేడుకలు సంప్రదాయబద్ధంగా జరిగాయి.  భక్తులు తమకు అందుబాటులో ఉన్న పుట్టల వద్దకు వెళ్లి అక్కడ బారులు తీరి మరీ పూజలు చేశారు. మట్టిపుట్టలను రంగవల్లికలతో అలంకరించి  పసుపు, కుంకుమలతో పూజలు చేశారు.  పుట్టలో పాలుపోసి, చలిమిడి, వస్త్రం, వడపప్పు వంటి వాటిని నైవేద్యంగా సమర్పించారు. పుట్ట చుట్టూ ప్రదక్షణలు చేస్తూ నాగదేవతను ఆరాధించారు. పిల్లలు, పెద్దలు ఆనందంతో భాణసంచాను కాల్చారు. నగరంలోని ఆంధ్రాయూనివర్సిటీ ప్రాంగణం, వెంకోజీపాలెం, సింహాద్రిపురం, అక్కయ్యపాలెం, సీతమ్మధార, నరసింహనగర్‌, పోర్టు స్టేడియం ఆవరణ, జ్ఞానాపురం, ఎల్లమ్మతోట ఏరియా, మురళీనగర్‌, మాధవధార, మర్రిపాలెం వుడాకాలనీ, రైల్వే న్యూకాలనీ, కంచరపాలెం, మద్దిలపాలెం ప్రాంతాల్లోని పుట్టల వద్ద భక్తులు అధిక సంఖ్యలో వచ్చి నాగదేవతకు పూజలు చేశారు. కాగా  జూపార్కులోని పుట్టల వద్ద  పూజలు నిర్వహించేందుకు భక్తులను అనుమతించ లేదు. 

Updated Date - 2020-11-19T05:39:20+05:30 IST