దేశానికి సేవలందించాలి
ABN , First Publish Date - 2020-07-27T11:35:30+05:30 IST
దేశానికి ప్రతి ఒక్కరు తమ వంతు సేవలందించాలని హిందుస్థాన్ స్కౌట్స్, గైడ్స్ రాష్ట్ర కమిషనర్ ముత్యాలరాజు అన్నారు.

హిందుస్థాన్ స్కౌట్స్, గైడ్స్ రాష్ట్ర కమిషనర్ ముత్యాలరాజు
సిరిపురం, జూలై 26: దేశానికి ప్రతి ఒక్కరు తమ వంతు సేవలందించాలని హిందుస్థాన్ స్కౌట్స్, గైడ్స్ రాష్ట్ర కమిషనర్ ముత్యాలరాజు అన్నారు. హిందుస్థాన్ స్కౌట్స్, గైడ్స్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఆదివారం సిరిపురంలో నిర్వహించిన కరోనా వైరస్‌పై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రతిఒక్కరు దేశానికి తమవంతు సేవ చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదదర్శి సుధీర్‌బాబు, చైర్మన్ గిరిధర్ రాజు, స్పోర్ట్స్ అథారిటీ సభ్యుడు రణధీర్, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు రెడ్డెం దుర్గాప్రసాద్, హిందుస్థాన్ స్కౌట్ అండ్ గైడ్స్ డీఓసీ మాధవరావు తదితరులు పాల్గొన్నారు.