వైకుంఠవాసునిగా అప్పన్న

ABN , First Publish Date - 2020-12-26T06:23:28+05:30 IST

ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి శుక్రవారం వైకుంఠవాసునిగా ఉత్తర రాజగోపురం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు.

వైకుంఠవాసునిగా అప్పన్న

ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకున్న భక్తులు


ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి శుక్రవారం వైకుంఠవాసునిగా ఉత్తర రాజగోపురం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. సుదర్శన, పాంచజన్యాలు, కటి, అభయహస్తాలతో కొలువుదీరిన స్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తెల్లవారుజామునుంచే బారులుతీరారు. ఆలయ సంప్రదాయం ప్రకారం పాలక మండలి చైర్‌పర్సన్‌ సంచయిత గజపతి తొలి దర్శనం చేసుకోగా, ఉదయం 5.30 గంటల నుంచి సాధారణ భక్తులను అనుమతించారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.

Updated Date - 2020-12-26T06:23:28+05:30 IST