ఏయూ వీసీతో ఎంఎస్‌ఏంఈ ప్రతినిధుల భేటీ

ABN , First Publish Date - 2020-12-12T04:33:38+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డితో శుక్రవారం ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ ప్రతినిధులభేటీ అయ్యారు.

ఏయూ వీసీతో ఎంఎస్‌ఏంఈ ప్రతినిధుల భేటీ
వీసీ ప్రసాద్‌రెడ్డితో చర్చిస్తున్న ఎంఎస్‌ఎంఈ ప్రతినిధులు

ఏయూ క్యాంపస్‌, డిసెంబరు11: ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డితో శుక్రవారం  ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ ప్రతినిధులభేటీ అయ్యారు. ఏయూ విద్యార్థులకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కల్పన తదితర అంశాలపై చర్చించారు. వర్సిటీతో ఒప్పందం చేసుకునేందుకు ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ ముందుకు వచ్చింది. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌, ఐపీఆర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ హనుమంతు పురుషోత్తం, ఎంఎస్‌ఎంఈ డీజీఎం ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


విద్యార్థులను అభినందించిన వీసీ 

ఆంధ్ర విశ్వవిద్యాలయం కామర్స్‌ మేనేజ్‌మెంట్‌ విభాగ విద్యార్థులు జాతీయ స్థాయి అర్హత పరీక్ష(యూజీసీ నెట్‌)లో ప్రతిభ కనపర్చారు. కామర్స్‌ విద్యార్థి టి. సంతోష్‌ కుమార్‌, మేనేజ్‌మెంట్‌ విద్యార్థి జి.రాకేష్‌ వర్మలను శుక్రవారం వీసీ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి అభినందించారు. సంతోష్‌కుమార్‌ జాతీయ స్థాయిలో 7వ స్థానం సాధించారు. కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు పాల్గొన్నారు. 


వీసీని అభినందించిన మాజీ ఎంపీ

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన పీవీజీడీ ప్రసాద్‌రెడ్డిని శుక్రవారం వర్సిటీలోని ఆయన కార్యాలయంలో మాజీ ఎంపీ కిల్లి కృపారాణి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. 

Updated Date - 2020-12-12T04:33:38+05:30 IST