విజయసాయి దంపతులకు శారదా పీఠాధిపతుల ఆశీస్సులు

ABN , First Publish Date - 2020-10-03T17:31:23+05:30 IST

ఎంపీ విజయసాయిరెడ్డి దంపతులు శనివారం విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు.

విజయసాయి దంపతులకు శారదా పీఠాధిపతుల ఆశీస్సులు

విశాఖపట్నం : వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి దంపతులు విశాఖ శ్రీ శారదాపీఠంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలను కలిశారు. శనివారం ఉదయం చినముషిడివాడలోని విశాఖ శారదా పీఠానికి వెళ్ళారు. మొదట స్వామీజీల ఆశీస్సులు అందుకున్న దంపతులు అనంతరం పీఠం ప్రాంగణంలోని శారదా స్వరూప రాజశ్యామలా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


చాతుర్మాస్య దీక్ష ముగించుకుని విశాఖకు తిరిగి వచ్చిన తర్వాత పీఠాధిపతుల ఆశీస్సులు అందుకోవడానికి విజయసాయి దంపతులు ప్రత్యేకంగా పీఠానికి వచ్చారు. విజయసాయిరెడ్డి వెంట మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదీప్ రాజు, వైఎస్సార్సీపీ నేత వంశీకృష్ణ తదితరులు ఉన్నారు.Updated Date - 2020-10-03T17:31:23+05:30 IST