సీఎం జగన్‌తో ఎంపీ ఎంవీవీ భేటీ

ABN , First Publish Date - 2020-12-11T04:09:11+05:30 IST

నగరానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి పనుల గురంచి ఎంవీ ఎంవీవీ సత్యనారాయణ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించారు.

సీఎం జగన్‌తో ఎంపీ ఎంవీవీ భేటీ
సీఎం జగన్‌ను కలిసిన ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

విశాఖపట్నం, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): నగరానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి పనుల గురంచి ఎంవీ ఎంవీవీ సత్యనారాయణ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చర్చించారు. పోలవరం నుంచి పైప్‌లైన్‌ ద్వారా నగరానికి తాగునీరు సరఫరా, భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌, గాజువాక హౌస్‌కమిటీ సమస్యలు, యారాడ భూ సమస్య, స్టీల్‌ప్లాంట్‌ నిర్వాసితులకు ఆర్‌ఆర్‌ కార్డులు, పెందుర్తి నుంచి అరకు వరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం, బీచ్‌ వెంబడి భోగాపురం వరకు ఆరులైన్ల రహదారి నిర్మాణం వంటివాటిపై సుమారు గంటన్నరసేపు సీఎంతో చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీతోపాటు ఆడిటర్‌ జీవీ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-11T04:09:11+05:30 IST