ఎల్‌జీ పాలిమర్స్‌ను తరలించండి

ABN , First Publish Date - 2020-05-10T06:50:34+05:30 IST

ఎల్‌జీ పాలిమర్స్‌లో విషవాయువు లీకైన ఘటనలో 12 మంది మృతి చెందిన నేపథ్యంలో ఈ కంపెనీని మరో ప్రాంతానికి ..

ఎల్‌జీ పాలిమర్స్‌ను తరలించండి

 సీఎస్‌కు టీడీపీ ఎమ్మెల్యేల వినతి


విశాఖపట్నం, మే 9(ఆంధ్రజ్యోతి): ఎల్‌జీ పాలిమర్స్‌లో విషవాయువు లీకైన ఘటనలో 12 మంది మృతి చెందిన నేపథ్యంలో ఈ కంపెనీని మరో ప్రాంతానికి తరలించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని నగరానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు పి.గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు కోరారు. శనివారం నోవాటెల్‌లో  ఆమెను వారు కలిసి వినతిపత్రం అందజేశారు. 1970 దశకంలో హిందూస్థాన్‌ పాలిమర్స్‌ కంపెనీ ఏర్పాటు సమయంలో జనావాసాలు లేవని, ఇప్పుడు వేల ఆవాసాలు ఏర్పడిన విషయాన్ని వినతిపత్రంలో పేర్కొన్నారు. గురువారం తెల్లవారుజామున జరిగిన సంఘటన తరువాత జనావాసాల మధ్య ఉన్న కంపెనీని కొనసాగించడం శ్రేయస్కరం కాదన్నారు. వెంటనే కంపెనీని మూసివేసి ఆ తరువాత మరో చోటకు తరలించాలని కోరారు. 

Updated Date - 2020-05-10T06:50:34+05:30 IST